ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russia : కనీసం 10 మంది పిల్లలకు జన్మనిచ్చే మహిళలకు భారీ ఆఫర్

ABN, First Publish Date - 2022-08-18T19:09:55+05:30

కనీసం పది మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : కనీసం పది మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన నైరాశ్యంతో కూడిన చిట్టచివరి ప్రయత్నమని నిపుణులు చెప్తున్నారు. 


జనాభా క్షీణతను అరికట్టేందుకు వ్లదిమిర్ పుతిన్ ఓ పథకాన్ని ప్రకటించారు. దీనికి మదర్ హీరోయిన్ (Mother Heroine) అని పేరు పెట్టారు. ఈ పథకం క్రింద 10 మంది బిడ్డలకు జన్మనిచ్చే తల్లికి ఆర్థిక సాయం చేస్తారు. అయితే 10 మంది బిడ్డలు జీవించి ఉండటం తప్పనిసరి.  పదో బిడ్డకు మొదటి పుట్టినరోజునాటికి 1 మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.13 లక్షలు) చెల్లిస్తారు. 


ఈ ఏడాది మార్చి నుంచి రోజువారీ కరోనావైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉండటం, ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల మరణించినవారి సంఖ్య 50,000కు చేరుతుండటం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 


రష్యన్ రాజకీయ, భద్రత రంగాల ఎక్స్‌పర్ట్ డాక్టర్ జెన్నీ మాథర్స్ (Dr Jenny Mathers) ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పుతిన్ ప్రకటించిన మదర్ హీరోయిన్ పథకం నైరాశ్యంలో చేపట్టిన అంతిమ ప్రయత్నమని చెప్పారు. క్షీణిస్తున్న జనాభా సమస్య (demographic crisis)ను పరిష్కరించేందుకు దీనిని అమలు చేస్తున్నారన్నారు. పెద్ద కుటుంబాలవారు ఎక్కువ దేశభక్తిని కలిగి ఉంటారని పుతిన్ చెప్తున్నారని అన్నారు. ఇది సోవియెట్ యూనియన్ కాలంనాటి ప్రోత్సాహకమని చెప్పారు. అయితే ఆర్థిక సాయం కోసం పెట్టిన షరతు వింతగా ఉందన్నారు. జనాభా తగ్గిపోతుండటం 1990వ దశకం నుంచి ప్రారంభమైందన్నారు. కోవిడ్, ఉక్రెయిన్‌పై యుద్ధం సమస్యను తీవ్రతరం చేశాయని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి రష్యన్ మహిళలను ప్రోత్సహించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే ఈ డబ్బు కోసం 10 మంది పిల్లల్ని పెంచడానికి ఎవరు ముందుకొస్తారన్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళంతా ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. రష్యాలో చాలా ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలు ఉన్నాయని చెప్పారు. 


Updated Date - 2022-08-18T19:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising