ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం

ABN, First Publish Date - 2022-06-26T08:01:46+05:30

దాదాపు రెండు నెలలుగా డాన్‌బా్‌స ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దురాక్రమణను కొనసాగిస్తున్న రష్యా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్క రోజే 50 రాకెట్లతో పుతిన్‌ సేనల దాడి

కీవ్‌, జూన్‌ 26: దాదాపు రెండు నెలలుగా డాన్‌బా్‌స ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దురాక్రమణను కొనసాగిస్తున్న రష్యా.. అనూహ్యంగా ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపైనా విరుచుకుపడింది. ఒక్క రోజు వ్యవధిలో 50పైగా క్షిపణులను ప్రయోగించింది. ఓవైపు లిసిచాన్స్క్‌ను గుప్పిట పట్టాలని చూస్తూనే.. ఈ దాడులకు దిగింది. నల్ల సముద్రం నుంచి పశ్చిమాన ల్వీవ్‌ రీజియన్‌లో ఉన్న యారోవ్‌ మిలటరీ బేస్‌పై క్షిపణలను వదిలింది. ఇక్కడ ఉక్రెయిన్‌ ఫైటర్లతో పాటు విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన సైనికులూ ఉన్నారు. మార్చిలో ఈ బేస్‌పై రష్యా చేసిన దాడిలో 35 మంది మృతి చెందారు. బెలారస్‌ నుంచి ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహీవ్‌పై 20 రాకెట్లతో దాడి చేసింది. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని జైటోమిర్‌ రీజియన్‌పై శనివారం ఉదయం దాదాపు 30 రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు లుహాన్స్క్‌ ప్రావిన్స్‌ పూర్తిగా రష్యా చేతుల్లోకి వెళ్లనుంది..! ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు పట్టున్నది సీవీరోడోనెట్స్క్‌, లిసిచాన్స్క్‌ నగరాలు, సమీప గ్రామాలు మాత్రమే. ఇప్పటికే సీవీరోడోనెట్స్క్‌ను ధ్వంసం చేసిన రష్యా.. పొరుగున ఉండే లిసిచాన్స్క్‌లోకి ప్రవేశించింది. 2014 నుంచి లుహాన్స్క్‌లోని 95 శాతం, డోనెట్స్క్‌ ప్రావిన్స్‌లోని 50 శాతం భూభాగాన్ని రష్యా మద్దతున్న తిరుగుబాటుదారులు నియంత్రిస్తున్నారు. సీవీరోడోనెట్స్క్‌, లిసిచాన్స్క్‌ సైతం ఇప్పుడు రష్యా నియంత్రణలోకి వెళ్లడంతో లుహాన్స్క్‌ మొత్తం మాస్కో ఆధీనంలోకి వచ్చినట్లయింది.

Updated Date - 2022-06-26T08:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising