ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌‌లోని ఖెర్సోన్ నగరంపై నియంత్రణ సాధించాం : రష్యా

ABN, First Publish Date - 2022-03-02T21:04:04+05:30

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడో రోజుకు చేరింది. ఉక్రెయిన్‌లోని ఖెర్సోన్ నగరంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడో రోజుకు చేరింది. ఉక్రెయిన్‌లోని ఖెర్సోన్ నగరంపై పట్టు సాధించామని రష్యన్ సైన్యం బుధవారం ప్రకటించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఐగోర్ కొనషెంకోవ్ టెలివైజ్డ్ రిమార్క్స్‌లో మాట్లాడుతూ, ఖెర్సోన్‌లోని రీజనల్ సెంటర్‌ను రష్యన్ సాయుధ దళాలు పూర్తి నియంత్రణలోకి తెచ్చుకున్నాయని చెప్పారు. 


ప్రభుత్వ సేవలు, రవాణా కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఆహారం, నిత్యావసర వస్తువుల కొరత ఉండబోదని చెప్పారు. ప్రజల రక్షణ, ప్రభుత్వ సేవల కొనసాగింపు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై స్థానిక అధికారులతో రష్యన్ సైన్యం చర్చలు జరుపుతోందన్నారు. 


ఇదిలావుండగా ఖెర్సోన్ మేయర్ ఐగోర్ కొలిఖైయెవ్ ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, తాము ఇంకా ఉక్రెయిన్‌ నియంత్రణలోనే ఉన్నామని, ఇప్పటికీ దృఢంగానే ఉన్నామని చెప్పారు. మృతదేహాలను సేకరించేందుకు, విద్యుత్తు, గ్యాస్, నీరు, హీటింగ్‌లను పునరుద్ధరించేందుకు ఓ మార్గాన్ని అన్వేషించవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికిప్పుడు వీటిని పూర్తి చేయడమంటే ఓ అద్భుతాన్ని సృష్టించడమేనన్నారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని 1,500కు పైగా మిలిటరీ ఫెసిలిటీస్‌ను దెబ్బతీసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఐగోర్ కొనషెంకోవ్ బుధవారం చెప్పారు. 58 విమానాలు, 46 డ్రోన్లు, 472 ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2022-03-02T21:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising