ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-02-28T14:04:56+05:30

రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ సోమవారం నుంచి ఐరోపాకు అన్ని విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూరప్‌కు వెళ్లే అన్ని విమానాల రద్దు

మాస్కో : రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ సోమవారం నుంచి ఐరోపాకు అన్ని విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది.యునైటెడ్ కింగ్‌డమ్‌ రష్యా విమానాలను   నిషేధించింది. దీంతో రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ సోమవారం నుంచి యూరప్‌కు రాకపోకలు సాగించే అన్ని విమాన సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించింది.ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా అనేక దేశాలు తమ గగనతలాన్ని మూసివేయాలని నిర్ణయించిన తర్వాత... తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమానాలను నిలిపివేయాలని రష్యా ఎయిర్‌లైన్ నిర్ణయించింది.ఫిబ్రవరిలో యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ తదుపరి నోటీసు వచ్చేవరకు ఏరోఫ్లాట్‌ విమానాలను సస్పెండ్ చేసింది.


 తదుపరి నోటీసు ఇచ్చే వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌కు లేదా దాని నుంచి విమానాలను నడపడానికి ఏరోఫ్లాట్ విమానాలను అనుమతించమని యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి తెలిపారు.యూరోపియన్ దేశాలు, కెనడా రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఉక్రెయిన్‌పై తన దాడిని ముగించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఈ చర్య తీసుకుంది. రష్యా విమానాల ట్రాఫిక్‌కు తన గగనతలాన్ని మూసివేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించిందని విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు.జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ బ్రిటన్, నార్డిక్స్,బాల్టిక్ రాష్ట్రాలు రష్యా విమానాలు రాకుండా తమ గగనతలంపై నిషేధాన్ని ప్రకటించాయి.


Updated Date - 2022-02-28T14:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising