ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ బలగాలు లొంగిపోవాలంటూ రష్యా హెచ్చరిక

ABN, First Publish Date - 2022-04-19T23:27:28+05:30

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలై 50 రోజులు గడిచినప్పటికీ అనుకున్న ఫలితం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలై 50 రోజులు గడిచినప్పటికీ అనుకున్న ఫలితం రాబట్టలేక పోవడంతో రష్యా తాజా హెచ్చరికలు జారీచేసింది. ఉక్రెయిన్ బలగాలు తక్షణం ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడులను రష్యా యోచన చేస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా హెచ్చరికలు వెలువడటం విశేషం. దీనికితోడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారంనాడు ప్రపంచదేశాలకు చేసిన హెచ్చరిక కూడా మరో కారణం.


రష్యా అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉన్నందున తగిన మార్గాలను అన్వేషించాలని ప్రపంచ దేశాలకు జెలెన్‌స్కీ హెచ్చరికలు చేశారు. అయితే, రష్యా అణ్వాయుధాల ప్రయోగించే అవకాశం ఉందన్న తన వాదనకు బలం చేకూర్చే ఎలాంటి ఆధారాలను ఆయన వెల్లడించలేదు. ''ప్రపంచం వేచిచూడాల్సిన పని లేదు. సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది''అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. దీనికి మందు, క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డెమిట్రో పెస్కోవ్ మాట్లాడుతూ, తమ ఉనికికి ప్రమాదం కలిగే అవకాశం ఉందనుకున్నప్పుడు మాత్రమే రష్యా అణ్వాయుధాల ఆలోచన చేస్తుందని అన్నారు.

Updated Date - 2022-04-19T23:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising