ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనిక సామాగ్రిని పంపించండి... చైనాను కోరిన రష్యా

ABN, First Publish Date - 2022-03-14T17:49:34+05:30

ఉక్రెయిన్ దేశంపై దండయాత్ర చేసిన తర్వాత తమకు సైనిక సామాగ్రిని పంపించాలని రష్యా చైనా దేశాన్ని కోరింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఉక్రెయిన్ దేశంపై దండయాత్ర చేసిన తర్వాత తమకు సైనిక సామాగ్రిని పంపించాలని రష్యా చైనా దేశాన్ని కోరింది. ఉక్రెయిన్ దేశంపై దాడులు చేస్తున్న రష్యా చైనా దేశాన్ని సైనిక సామాగ్రిని పంపించమని కోరినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. రష్యా చైనా ఆయుధ సహకారం కోరిన నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ సోమవారం రోమ్‌లో చైనా అగ్ర దౌత్యవేత్త యాంగ్ జీచితో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్రను చైనా ఖండించలేదు. రష్యా దాడిని దండయాత్ర అని పిలవక పోగా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా కోరింది.రష్యా ఏ రకమైన ఆయుధాలను అభ్యర్థించిందో, దీనిపై చైనా ఎలా స్పందించిందో యూఎస్ అధికారులు పేర్కొనలేదు.


Updated Date - 2022-03-14T17:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising