ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజుల్లో రెండోసారి.. ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగం

ABN, First Publish Date - 2022-03-20T23:18:12+05:30

ఉక్రెయిన్‌పై దాడిని ముమ్మరం చేసిన రష్యా ఈసారి హైపర్ సోనిక్ క్షిపణులకు పనిచెప్పింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడిని ముమ్మరం చేసిన రష్యా ఈసారి హైపర్ సోనిక్ క్షిపణులకు పనిచెప్పింది. శుక్రవారం తొలిసారి ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన రష్యా.. రెండు రోజుల్లోనే రెండోసారి ఆదివారం మరోమారు వాటిని ప్రయోగించింది. నల్లసముద్రం, కాస్పియన్ సముద్రంలోని నౌకల నుంచి వీటిని ఉక్రెయిన్ నగరాలపై ప్రయోగించింది. రష్యా తొలిసారి శుక్రవారం కింజల్ హైపర్ సోనిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆయుధాలు నిల్వ ఉంచిన ఇవానో-ఫ్రాంకి‌వ్‌స్క్ ప్రాంతంలోని డెలియటిన్ గ్రామంలో అండర్ గ్రౌండ్ వేర్‌హౌస్‌ను ఈ క్షిపణులతో ధ్వంసం చేసినట్టు చెప్పారు. 

 

 ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తొలిసారి వీటిని ఉపయోగించింది. కింజల్ హైపర్ సోనిక్ మిసైళ్లు ధ్వని కంటే ఐదు రెట్ల వేగంతో పయనిస్తాయి. గంటకు 6 వేల కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.  

Updated Date - 2022-03-20T23:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising