ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukraineపై రష్యా రసాయన ఆయుధాలు ప్రయోగించొచ్చు...నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆందోళన

ABN, First Publish Date - 2022-03-16T18:22:58+05:30

ఉక్రెయిన్‌ దేశంపై రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగించవచ్చని ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రస్సెల్స్:  ఉక్రెయిన్‌ దేశంపై రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగించవచ్చని ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు.‘‘మాస్కో ఉక్రెయిన్‌లో రసాయన ఆయుధాలతో దాడులకు పాల్పడవచ్చని మేం ఆందోళన చెందుతున్నాం’’ అని పాశ్చాత్య సైనిక కూటమి యొక్క సెక్రటరీ జనరల్ స్టోల్టెన్‌బర్గ్ విలేకరుల సమావేశంలో చెప్పారు.ఉక్రెయిన్‌పై పోరాటంలో రష్యా చైనాను సైనిక సహాయం కోరిందని నివేదికలు సూచించిన తర్వాత నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్య దేశంగా చైనాకు ఉందని స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.


ఉక్రెయిన్‌లో సైనిక జీవసంబంధ కార్యకలాపాలకు అమెరికా నిధులు సమకూరుస్తోందన్న రష్యా వాదనలు అసంబద్ధమని  కూడా జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 21వ రోజుకు చేరుకోవడంతో, రష్యా కైవ్‌పై బాంబు దాడిని ఉధృతం చేసింది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు రెండో రోజు కూడా కొనసాగాయి.యుఎన్ శరణార్థి ఏజెన్సీ నుంచి వచ్చిన డేటా ప్రకారం యుద్ధం వల్ల పారిపోతున్న ఉక్రేనియన్ల సంఖ్య మంగళవారం నాటికి 3 మిలియన్లకు చేరుకుంది.


Updated Date - 2022-03-16T18:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising