ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాది సిగ్గులేనితనం

ABN, First Publish Date - 2022-09-23T07:38:00+05:30

ఉక్రెయిన్‌ విషయంలో రష్యా నిస్సిగ్గుగా ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో గత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌కు ప్రపంచదేశాలు అండగా నిలవాలి: బైడెన్‌ 


ఐరాస, సెప్టెంబరు 22: ఉక్రెయిన్‌ విషయంలో రష్యా నిస్సిగ్గుగా ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో గత ఏడునెలలుగా రష్యా సాగిస్తున్న దురాక్రమణ గురించి బుధవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బైడెన్‌ కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌ను, దాని సంస్కృతిని చెరిపేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. ‘భద్రతామండలిలోని ఓ శాశ్వత సభ్యదేశం పొరుగుదేశంపై దురాక్రమణకుపాల్పడింది. ప్రపంచ పటం నుంచి ఓ సార్వభౌమ దేశాన్ని చెరిపేసేందుకు ప్రయత్నించింది’ అని నిందించారు.


భద్రతా మండలిలో రష్యాకు వీటో హక్కు, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో ఓటు హక్కు కూడా తొలగించాలని పేర్కొన్నారు. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌, మాల్దీవుల అధ్యక్షుడు మాయియా సందు, ఘనా అధ్యక్షుడు నానా అడ్డో డన్క్వా కూడా రష్యా వైఖరిని తప్పుబట్టారు.మరోవైపు ఐరోపా దేశాల విదేశాంగమంత్రులు ఐరాసలో అత్యవసర సమావేశం నిర్వహించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు నిర్ణయించారు. 


గెలిచి తీరుతాం: జెలెన్‌స్కీ

రష్యా దాడులు రెట్టింపు అయినప్పటికీ ఈ యుద్ధంలో తామే గెలుస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతినబూనారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ రష్యాను శిక్షించాలని ప్రపంచదేశాలను అభ్యర్థించారు. ‘మా భూభాగంలోని ప్రతి అంగుళాన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఉక్రెయిన్‌ జెండాను ఎగురవేస్తాం. అయితే, దానికి కొంత సమయం పడుతుంది’ అని పేర్కొన్నారు.


రష్యాకు ఆయుధాలు అమ్మలేదు: ఉత్తరకొరియా

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు తాము ఆయుధాలేమీ విక్రయించలేదని, ఇప్పుడు కూడా విక్రయించే ప్రణాళికలు లేవని ఉత్తరకొరియా ప్రకటించింది. తమ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. కాగా, రష్యాకు లక్షలాది శతఘ్ని గుండ్లు, రాకెట్లను ఉత్తరకొరియా విక్రయించిందని ఈనెల మొదట్లో అమెరికా అధికారులు ఆరోపించారు. 

Updated Date - 2022-09-23T07:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising