ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

new representative to the United Nations: ఐక్యరాజ్యసమితి మొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్

ABN, First Publish Date - 2022-08-03T16:34:09+05:30

ఐక్యరాజ్యసమితి(United Nations) శాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి(Senior diplomat), 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కంబోజ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి(United Nations) శాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి(Senior diplomat), 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కంబోజ్(Ruchira Kamboj) బాధ్యతలు స్వీకరించారు. భారతదేశం పక్షాన యునైటెడ్ నేషన్స్ లో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా(Indias first woman UN envoy ) రుచిరా బాధ్యతలు స్వీకరించారని యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుట్రెస్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రుచిరా మనందరం సాధించగలం అని అమ్మాయిలకు సూచన చేశారు.రుచిరా గతంలో భుటాన్ దేశంలో భారత రాయబారిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి స్థానంలో రుచిరా బాధ్యతలు చేపట్టారు. 


1987 సివిల్ సర్వీస్ బ్యాచ్ లో(Indian Foreign Service) టాపర్ అయిన రుచిరాకు టీఎస్ తిరుమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. రుచిరా మొదట ప్యారిస్ లో రాయబారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం రుచిరా ఢిల్లీకి వచ్చి యూరప్ వెస్ట్ డివిజన్ విదేశీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీగా పనిచేశారు. 1996 నుంచి 1999 వరకు మారిషస్ ఫస్ట్ సెక్రటరీగా సేవలందించారు.దక్షిణాఫ్రికాలో హైకమిషనరుగా పనిచేశారు. 


Updated Date - 2022-08-03T16:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising