ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Department of Transport: బస్సుల్లో మహిళలను వేధిస్తే దింపేయండి

ABN, First Publish Date - 2022-08-20T13:51:46+05:30

బస్సుల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని అక్కడికక్కడే దింపేయాలని రవాణాశాఖ(Department of Transport) ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                   - రవాణాశాఖ ఉత్తర్వులు


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 19: బస్సుల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని అక్కడికక్కడే దింపేయాలని రవాణాశాఖ(Department of Transport) ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు మరింత రక్షణ కల్పించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. కాస్తంత కఠిన నిబంధనల్నే అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. వారి రక్షణ, భద్రత కోసం బస్సుల్లో సీసీ టీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బెల్‌ తదితరాలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, మహిళలకు మరింత భద్రత కల్పించేలా రవాణాశాఖ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఆ ప్రకారం, బస్సుల్లో మహిళలను కొంటెగా చూసే వారిని తక్షణం బస్సు నుంచి దించివేయాలని, అలాంటి వారు మరింత హద్దు మీరితే బస్సును నేరుగా సమీపంలోని పోలీస్‏స్టేషన్‌(Police Station) వద్దకు తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. అలాగే, మహిళలతో ద్వంద్వార్థాలతో మాట్లాడ్డం, వెకిలిచేష్టలతో బాధ పెట్టడం తదితరాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-08-20T13:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising