ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Driver, Conductor: మద్యం మత్తులో డ్రైవర్‌: బస్సు నడిపిన కండక్టర్‌

ABN, First Publish Date - 2022-08-23T15:48:25+05:30

కాంచీపురం నుంచి పుదుచ్చేరికి ఆదివారం అర్థరాత్రి బయలుదేరిన రవాణా సంస్థ బస్సును కండెక్టర్‌ నడపటంతో ప్రయాణికులు భీతిల్లారు. ఆ బస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : కాంచీపురం నుంచి పుదుచ్చేరికి ఆదివారం అర్థరాత్రి బయలుదేరిన రవాణా సంస్థ బస్సును కండెక్టర్‌ నడపటంతో ప్రయాణికులు భీతిల్లారు. ఆ బస్‌ డ్రైవర్‌(Bus driver) ధరనేంద్రన్‌ కాంచీపురంలోనే పీకలదాకా మద్యం తాగడంతో బస్సు నడపలేకపోయాడు. అప్పటికే అందరికీ టికెట్లు ఇచ్చిన కండెక్టర్‌ హోలీఫేస్‌ బస్సు నడిపాడు. కాంచీపురం(Kanchipuram) నుంచే ఆ బస్సు నెమ్మదిగా వెళ్లింది, మలుపుల వద్ద బస్సు అటూ ఇటూ ఊగింది. ఈలోగా కొందరు ప్రయాణికులు చూడగా ఆ బస్సును కండెక్టర్‌  నడుపుతున్నాడని తెలుసుకుని దిగ్ర్భాంతి చెందారు. ఆ కేబిన్‌లో ఓ మూల డ్రైవర్‌ ధరనేంద్రన్‌ మద్యం మత్తులో జోగుతుండటాన్ని గమనించారు. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులంతా వందవాసి వద్ద బస్సు ఆపమన్నారు. ప్రయాణికుల ఆగ్రహానికి భయపడి కండెక్టర్‌ బస్సు నిలిపేశాడు. ఈలోగా ఈ ఘటనపై ప్రయాణికులు పోలీసులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను మందలించారు. ఆ తర్వాత ప్రయాణికులందరూ మరో బస్సులో వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన దిండివనం డిపో  ఉన్నతాధికారులు డ్రైవర్‌ ధరనేంద్రన్‌ను సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2022-08-23T15:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising