ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలి: సీఎం గెహ్లోత్

ABN, First Publish Date - 2022-04-16T03:21:23+05:30

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలి: సీఎం గెహ్లోత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి రాజకీయ పార్టీగా మార్చాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సలహా ఇచ్చారు. 10-15 ఏళ్లలో అఖండ భారత్ సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనకాల ఉండి మద్దతు ఇస్తూ ఉంటారని కానీ ఇప్పుడు వారికి ఆ అవసరం లేదని, బీజేపీతో కలిసి పోయి రాజకీయ పార్టీగా మారొచ్చని గెహ్లోత్ అన్నారు.


శుక్రవారం రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలో ఇప్పటికీ అంటరానితనం ఆధారంగా కేసులు నమోదు అవుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మనకు నిజంగా అఖండ భారత్ కావాలని ఉంటే అన్ని కులాలను, మతాలను ఒకతాటిపైకి తీసుకురావాలి. అంటరానితనానికి అణచివేతకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేయాలి. ప్రధానమంత్రి కూడా దేశాన్ని ఉద్దేశించి దీనిపై మాట్లాడాలి. ఆహారం, మతం, కులం, బట్టలు ఆధారంగా ఎవరిపై వివక్ష చూపకుండా ఉండాలి’’ అని అన్నారు.

Updated Date - 2022-04-16T03:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising