ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రహదారి మాకొద్దు

ABN, First Publish Date - 2022-06-15T13:44:47+05:30

‘పొన్నేరి సమీపం తచ్చూరు - చిత్తూరు మధ్య ఆరు లేన్ల జాతీయ రహదారి మాకొద్దు’ అని పెరియపాళయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఇటీవల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘పొన్నేరి సమీపం తచ్చూరు - చిత్తూరు మధ్య ఆరు లేన్ల జాతీయ రహదారి మాకొద్దు’ అని పెరియపాళయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.3200 కోట్ల వ్యయంతో తచ్చూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు వరకు 136 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు వారం రోజులుగా పెరియపాళం వద్ద జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఎక్స్‌కవేటర్‌ యంత్రాల ద్వారా పెరియపాళయం వద్దనున్న తండలం, పాలవాక్కం, పరుత్తిమేని కుప్పం, పొందవాక్కం, వెంగళత్తూరు, పిచ్చాటూరు ప్రాంతాల్లో నేలను చదును చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఈ రహదారి నిర్మాణపు పనుల వల్ల తమ పంటపొలాలను కోల్పోతామని పెరియపాళయం ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు రైతులతో చర్చలు కొనసాగించారు. చర్చలు ఫలించలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2022-06-15T13:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising