ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోతులు తవ్వితే.. బాధ్యత మీదే

ABN, First Publish Date - 2022-04-22T17:28:59+05:30

రాజధాని బెంగళూరులో ఇ కపై అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ రహదారులను తవ్వేసి తప్పించుకునేందుకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - సంబంధిత శాఖలే పూడ్చాలని ప్రభుత్వం ఆదేశం


బెంగళూరు: రాజధాని బెంగళూరులో ఇకపై అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ రహదారులను తవ్వేసి తప్పించుకునేందుకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. నగర పరిధిలో అభివృద్ధి, మరమ్మత్తులు, నీటి, కేబుల్‌ కనెక్షన్‌ల పేరిట రహదారులు తవ్వితే ఇకపై సంబంధిత శాఖలే పూర్తి జవాబుదారీ వహించేలా నియమాలకు రూపకల్పన చేశారు. బీబీఎంపీ అనుమతితోనే రహదారులను తవ్వాల్సి ఉంటుంది, అనంతరం సదరు రహదారులను యథాస్థితికి తెచ్చే, మరమ్మత్తులు చేపట్టే బాధ్యతను కూడా ఆయా శాఖలే నిర్వహించాల్సి ఉంటుంది. బీఎంఆర్‌సీఎల్‌, గెయిల్‌ గ్యాస్‌ ఇండియా, చిన్నతరహా నీటిపారుదలశాఖకు అత్యవసరమైతేనే రహదారులు తవ్వేందుకు అనుమతులు మంజూరు చేస్తారు. బెంగళూరు జలమండలి, బెస్కాం, కేపీటీసీఎల్‌ తదితర ప్రభుత్వ సంస్థలు రహదారులు తవ్వి బాధ్యతనుంచి తప్పించుకునే ఆస్కారం ఇకపై ఉండదు. తవ్వడానికి రహదారి ఎలా ఉందో... తవ్విన తర్వాత కూడా అదే స్థితిలో ఉంచాల్సిన బాధ్యతను సదరు సంస్థలే చేపట్టాల్సి ఉంటుంది. ఉల్లంఘనకు పాల్పడితే ఆయా విభాగాల ఇంజనీర్లు, అధికారులను బాధ్యులను చేయనున్నారు. బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్త ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఏప్రిల్‌ 18న ఆదేశాలు వచ్చాయని మే 1నుంచి అమలు కట్టుదిట్టంగా అమలు చేయనున్నామన్నారు. నగరవ్యాప్తంగా రహదారులను ఇష్టం వచ్చినట్టు తవ్వేయడంతో వర్షాలు కురిసిన సందర్భంలో రోడ్ల పరిస్థితి దుస్థితిగా ఉంటోందని ఇది ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని ప్రజలు పెద్దపెట్టున ఫిర్యాదులు చేయడంతో బీబీఎంపీ ఈ నిర్ణయం తీసుకుందన్నా రు. రహదారుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - 2022-04-22T17:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising