ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌జేడీ-జేడీయూ విలీనం?

ABN, First Publish Date - 2022-12-16T01:11:47+05:30

చీలికలు పేలికలైన జనతా పరివారంలో కొత్త పరిణామం సంభవించనుందా..? గతంలో బద్ధవిరోధులుగా ఉండి.. ప్రస్తుతం చెట్టపట్టాలు వేసుకుని బిహార్‌లో రాజ్యమేలుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త పార్టీకి నితీశ్‌ సారథ్యం!!

నేతలు ఖండిస్తున్నా ఆ దిశగానే సంకేతాలు

చీలికలు పేలికలైన జనతా పరివారంలో కొత్త పరిణామం సంభవించనుందా..? గతంలో బద్ధవిరోధులుగా ఉండి.. ప్రస్తుతం చెట్టపట్టాలు వేసుకుని బిహార్‌లో రాజ్యమేలుతున్న జనతాదళ్‌ (యు), రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) విలీనం కాబోతున్నాయా..? ఈ ప్రశ్నలకు తాజా రాజకీయ పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విలీనం గురించిన చర్చ రెండు పార్టీల్లోనూ సాగుతోంది. ఆ పార్టీల నేతలు పైకి ఖండిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఆ దిశగానే సంకేతాలు వదులుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా బిహార్‌ సీఎంగా కొనసాగుతున్న జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేశారు. విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రధాని పదవి చేపట్టాలని అభిలషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ వారసుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ సారథ్యం వహిస్తారని నితీశ్‌ ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అధిక సీట్లు సాధించి ప్రధాని పదవికి గట్టి పోటీదారుగా నిలవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.

అయితే వేర్వేరు పార్టీలుగా పోటీ చేసేకంటే.. జేడీయూ, ఆర్‌జేడీ విలీనమైపోతే రాష్ట్రంలో అతి పెద్ద శక్తిగా అవతరించవచ్చని.. కాంగ్రెస్‌, వామపక్షాలతో చేతులు కలిపితే బీజేపీని చావుదెబ్బ తీయొచ్చని నితీశ్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత అక్టోబరులో జరిగిన ఆర్‌జేడీ కార్యవర్గ సమావేశంలో.. పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మార్చే అధికారాన్ని అధినేత లాలూకు అప్పగిస్తూ తీర్మానించడం వెనుక వ్యూహమిదేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రెండు పార్టీలూ కలిసిపోవడం ద్వారా ఆవిర్భవించే కొత్త పార్టీకి నితీశ్‌ సారథ్యం వహిస్తారని ఆర్‌జేడీలోని కొందరు నేతలు అంటున్నారు. తాను ఢిల్లీ వెళ్తే తేజస్వి బిహార్‌ ప్రభుత్వాన్ని నడుపుతారని నితీశ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం ఆవిర్భవించాలంటే ప్రతిపక్షాల నడుమ విస్తృత ఏకాభిప్రాయం అవసరమని ఆయన పదే పదే చెబుతున్నారు.

సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2022-12-16T01:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising