ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Britain PM Elections: ఓటర్లకు భారీ హామీ ప్రకటించిన రుషి సునాక్

ABN, First Publish Date - 2022-08-10T01:55:53+05:30

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో గెలిచేందుకు రుషి సునాక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో గెలిచేందుకు రుషి సునాక్ (Rishi Sunak) భారీ తాయిలాలను ప్రకటిస్తున్నారు. విద్యుత్తు సంక్షోభం తీవ్రమవుతోందన్న హెచ్చరికల నేపథ్యంలో తనను గెలిపిస్తే గృహ విద్యుత్తు ఛార్జీలను ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చూస్తానని మంగళవారం హామీ ఇచ్చారు. అప్పులను పరిమితం చేసి, ప్రభుత్వ నిధులను పొదుపుగా ఖర్చు పెట్టడం ద్వారా ప్రజలపై విద్యుత్తు భారాన్ని తగ్గిస్తానని తెలిపారు. 


కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌షిప్ ఎన్నికల్లో రుషి సునాక్, లిజ్ ట్రుస్ (Liz Truss) హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఇదిలావుండగా, ఎనర్జీ కన్సల్టెన్సీ కార్న్‌వాల్ ఇన్‌సైట్ (Cornwall Insight) ఇటీవల ఓ హెచ్చరిక చేసింది. గతంలో ప్రకటించినదాని కన్నా ఎక్కువ విద్యుత్తు బిల్లుల భారం ఈ చలికాలంలో పడబోతోందని చెప్పింది. దీనిని రుషి సునాక్ ఓ అవకాశంగా మలచుకున్నారు. ప్రజలకు మరింత మద్దతు అవసరమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ప్రకటించారు. బిల్లులు ఎంత ఎక్కువగా పెరుగుతాయో స్పష్టంగా తెలిసిన వెంటనే తాను చర్యలు ప్రారంభిస్తానని చెప్పారు. 


రుషి, లిజ్ ప్రచారంలో విద్యుత్తు సంక్షోభం సమస్య ఎక్కువ చర్చనీయాంశమైంది. పన్నులను తగ్గిస్తానని లిజ్ వాగ్దానం చేస్తున్నారు. అలా చేస్తే ద్రవ్యోల్బణం మరింత తీవ్రమవుతుందని రుషి హెచ్చరించారు. 


Updated Date - 2022-08-10T01:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising