ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala: ప్రతీ బిడ్డా ఓ వ్యక్తే.. మోరల్ పోలీసింగ్‌పై హక్కుల ప్యానెల్ సీరియస్

ABN, First Publish Date - 2022-07-25T22:37:22+05:30

కేరళలోని మన్నర్‌క్కాడ్ సమీపంలో ఇటీవల జరిగిన మోరల్ పోలీసింగ్(Moral Policing) ఘటనపై పాలక్కాడ్ చైల్డ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలక్కాడ్: కేరళలోని మన్నర్‌క్కాడ్ సమీపంలో ఇటీవల జరిగిన మోరల్ పోలీసింగ్(Moral Policing) ఘటనపై పాలక్కాడ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) తీవ్రంగా స్పందించింది. ప్రతి చిన్నారీ ఓ వ్యక్తేనని.. మానసిక, శారీరక వికాసానికి వారు అర్హులన్న అవగాహన ప్రజలకు కల్పించాలని సీడబ్ల్యూసీ పేర్కొంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డ ఒక వ్యక్తేనన్న అవగాహన సాధారణ ప్రజలకు ఇంకా రాలేదని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ పాలక్కాడ్ చైర్మన్ ఎంవీ మోహనన్ అన్నారు. 


మన్నర్‌క్కాడ్(Mannarkkad) సమీపంలో ఇటీవల మోరల్ పోలీసింగ్ ఘటనను ఆయన ప్రస్తావిస్తూ.. జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి నుంచి ఈ ఘటనపై నివేదిక కోరినట్టు చెప్పారు. బాధిత చిన్నారులకు అవసరమైతే వైద్య చికిత్సతోపాటు కౌన్నెలింగ్ కూడా ఇవ్వాలని  ఆదేశించినట్టు చెప్పారు. ఈ కేసు విషయంలో ముందుకెళ్లాలనుకుంటే చట్టపరంగా ఎలాంటి సాయమైనా అందిస్తామని మోహనన్ అన్నారు. 


బాధిత చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం పోలీసులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల వారు మాట్లాడుతూ.. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు తొలుత ప్రయత్నించినట్టు చెప్పారు. కాగా, నిందితులందరినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారని, ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని మోహనన్ వివరించారు.  


 ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. తమ ప్రిన్సిపల్ ఇన్‌చార్జ్‌తో కలిసి బస్టాప్‌లో కూర్చున్నామని, ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి తమ గ్రూపులోని ఓ అమ్మాయితో అనుచితంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థి పేర్కొన్నాడు. తాము ప్రశ్నిస్తే స్థానికులు కూడా వచ్చి తమపై దాడిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కనిపిస్తే స్థానికులు దానిని రచ్చ చేస్తున్నారని పేర్కొన్నాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.    

Updated Date - 2022-07-25T22:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising