ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CBDT కొత్త చైర్మన్‌గా Nitin Gupta

ABN, First Publish Date - 2022-06-27T20:44:53+05:30

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొత్త చైర్మన్‌గా ఇండియన్ రెవన్యూ సర్వీస్ (IRS) అధికారి నితిన్ శర్మ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొత్త చైర్మన్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి నితిన్ గుప్తా (Nitin Gupta) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడింది. 1986 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన గుప్తా బోర్డులో సభ్యుడు (ఇన్వెస్టిగేషన్)గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఆయన రిటైర్ కావలసి ఉంది. సీబీడీటీ చైర్మన్‌గా నితిన్ శర్మ నియామకాన్ని క్యాబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదించినట్టు ఈనెల 25న విడుదల చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు.


కాగా, చైర్మన్ సారథ్యంలోని సీబీడీటీలో స్పెషల్ సెక్రటరీ స్థాయిలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆదాయం పన్ను అడ్మినిస్ట్రేటివ్ బాడీగా సీబీడీటీ వ్యవహరిస్తుంది. ప్రస్తుతం బోర్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో 1985 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అనూజ సారంగి సీనియర్ మోస్ట్ అధికారి. ప్రగ్యా సహాయ్ సక్సేనా, శుభశ్రీ  అనంత్ క్రిష్ణన్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. వీరురువురూ ఐఆర్ఎస్ 1987 బ్యాచ్‌కి చెందిన వారు.

Updated Date - 2022-06-27T20:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising