ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme relief For Nupur Sharma: నూపుర్ శర్మకి అరెస్ట్ నుంచి మినహాయింపు.. సుప్రీంకోర్ట్ తాత్కాలిక రిలీఫ్..

ABN, First Publish Date - 2022-07-19T21:59:28+05:30

మహ్మద్ ప్రవక్త (Prophet Mohammad)పై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ(BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు (Nupru Sharma) తాత్కాలిక ఉపశమనం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్త (Prophet Mohammad)పై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ(BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు (Nupru Sharma) తాత్కాలిక ఉపశమనం దక్కింది. కేసు తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి మినహాయింపునిస్తూ సుప్రీంకోర్ట్(Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేసులు నమోదయిన రాష్ట్రాలు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోంలకు సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ప్రత్యమ్నాయ న్యాయ సహాయాన్ని ఏవిధంగా పొందుతారనేది ప్రస్తుతం తమ ఆందోళనగా ఉందని కోర్ట్ తెలిపింది. న్యాయ ప్రత్యమ్నాలను అన్వేషించే క్రమంలో ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వనున్నట్టు చెప్పింది. ఈ కేసులో వాదనలు ఆగస్టు 10న వింటామని వెల్లడిస్తూ వాయిదా వేసింది.


వేర్వేరు రాష్ట్రాల్లో తనపై నమోదయిన కేసులన్నింటినీ ఒక గ్రూపుగా చేర్చి విచారణ జరపాలనే నూపుర్ శర్మ అభ్యర్థనపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్ట్ కోరింది. కేసులన్నింటికీ ఒకేసారి  విచారించాలంటూ నూపుర్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్ట్ ఈ విధంగా స్పందించింది.

కాగా ప్రాణహాని ఉన్నందున అరెస్ట్ నుంచి మినహాయింపు నూపుర్ శర్మ తరపున న్యాయవాది  పిటిషన్ దాఖలు చేశారు. ప్రాణహాని కారణంగా న్యాయ సహాయాన్ని పొందడంలో ఆమె  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెకేషన్ బెంచ్ తనపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను కూడా తొలగించాలని నూపుర్ శర్మ తన పిటిషన్‌లో కోరారు.

Updated Date - 2022-07-19T21:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising