ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2023లో మాంద్యం

ABN, First Publish Date - 2022-12-16T01:08:47+05:30

కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దశాబ్దాలుగా చూడనంత ఎక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పదంటున్న ఆర్థిక నిపుణులు

గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి?

కరోనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఫలితం

న్యూఢిల్లీ, డిసెంబరు 15: కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దశాబ్దాలుగా చూడనంత ఎక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చవిచూస్తున్నారు. 2023 సంవత్సరంలో ఇది మరింత తీవ్ర స్థాయికి చేరుకునేలా కనిపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021లో కరోనా లాక్‌డౌన్‌లు ముగిసిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా దూసుకుపోయింది. ఆ డబ్బంతా ప్రపంచ వాణిజ్య వ్యవస్థను ముంచెత్తింది. అయితే, లాక్‌డౌన్‌లలో పనిలేకుండా ఉన్న ఫ్యాక్టరీలు, ఆ తర్వాత డిమాండ్‌కు తగ్గ వేగంగా పుంజుకోలేకపోయాయి. అలాగే, కొవిడ్‌ నిబంధనలు రిటైల్‌, రవాణా, ఆరోగ్య రంగాల్లో కార్మికుల కొరతకు కారణమయ్యాయి. కరోనా అనంతరం ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి అనంతరం అతిపెద్ద ఇంధన, గ్యాస్‌ ఎగుమతిదారు(రష్యా)పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో చమురు ధరలు ఇంకా పెరిగిపోయాయి. రెండంకెల ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పెంచింది. అల్పాదాయ వర్గాల జీవనాన్ని మరింత దుర్భరం చేసింది. అందుకే దీన్ని ‘పేదలపై పన్ను’గా అభివర్ణిస్తున్నారు. సంపన్న వినియోగదారులు పొదుపు నిధులను బయటికి తీసి బతికేస్తున్నారు. మరికొందరు అవసరాలు తీర్చుకోడానికి కష్టపడుతున్నారు. ఆహార బ్యాంకులపై ఆధారపడేవారి సంఖ్య పెరుగుతోంది. ధనిక దేశాల్లో జీవన వ్యయం ఆందోళనలు రాజకీయాలను శాసిస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మరో 7 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. డిమాండ్‌ను తగ్గించడానికి, ద్రవ్యోల్బణం కట్టడికి ప్రపంచంలోని సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపునకు శ్రీకారం చుట్టాయి. 2023 చివరినాటికి ప్రపంచ ద్రవ్యోల్బణం 4.7శాతానికి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. ఇది ప్రస్తుతంఉన్న ద్రవ్యోల్బణంలో సగం కంటే కొంచెం తక్కువ.

Updated Date - 2022-12-16T01:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising