ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసీదును తొలగించాలనే వ్యాజ్యాన్ని స్వీకరించండి

ABN, First Publish Date - 2022-05-20T08:29:01+05:30

జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతుండగానే మథురలోని షాహీ ఈద్గా మసీదు వివాదం జోరందుకుంటోంది!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పిటిషన్‌ విచారణార్హమే

మథుర సివిల్‌ జడ్జికి స్థానిక జిల్లా కోర్టు ఆదేశం

కృష్ణుడి గుడి కూల్చి కట్టిన మసీదును తొలగించాలని 2020లో వ్యాజ్యం

విచారణార్హం కాదన్న సివిల్‌ జడ్జి జిల్లా కోర్టు తీర్పుతో మళ్లీ విచారణకు


న్యూఢిల్లీ, మే 19: జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతుండగానే మథురలోని షాహీ ఈద్గా మసీదు వివాదం జోరందుకుంటోంది! అక్కడ ఔరంగజేబు హయాంలో శ్రీకృష్ణుడి(కాట్రా కేశవ్‌దేవ్‌) ఆలయాన్ని కూలగొట్టి నిర్మించిన షాహీ ఈద్గా మసీదును తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై మథుర జిల్లా కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆ పిటిషన్‌ విచారణార్హం కాదం టూ గతంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి.. ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలని సివిల్‌ జడ్జి కోర్టును ఆదేశించింది. లఖ్‌నవూకు చెందిన రంజనా అగ్నిహోత్రి, మరో ఆరుగురు కలిసి తమను శ్రీకృష్ణుడి మిత్రులుగా పేర్కొంటూ 2020 సెప్టెంబరు 25న సివిల్‌ జడ్జి కోర్టులో ఈ పిటిషన్‌ వేశారు. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టుకు చెందిన 13.37 ఎకరాల భూమిలో నిర్మించిన షాహీ ఈద్గా మసీదును తొలగించి ఆ భూమిని ట్రస్టుకు అప్పగించాలని కోరారు. అయితే, ప్రార్థనా స్థలాల చట్టం, 1991 కింద ఈ వ్యాజ్యం విచారణార్హం కాదని.. ఇలాంటి కేసులను విచారణకు స్వీకరిస్తే చాలా మంది భక్తు ల పేరుతో కోర్టుకు వస్తారంటూ సివిల్‌ జడ్జి 2020 సెప్టెంబరు 30న వారి పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో  పిటిషనర్లు జిల్లా జడ్జి కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేశారు. పిటిషనర్లతోపాటు సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, షాహీ ఈద్గా మసీదు సెక్రటరీ, మరో ఇద్దరి వాదనలు విన్న జిల్లా, సెషన్స్‌ జడ్జి రాజీవ్‌ భారతి ఈ వ్యాజ్యాన్ని విచారించాల్సిందిగా సివిల్‌ జడ్జిని ఆదేశించారు. కాగా.. ఇలాంటి  వివాదాలన్నింటికీ ప్రధాని మోదీ ముగింపు పలకాలని మజ్లిస్‌ చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-20T08:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising