ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పని చేస్తే కనుక ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమే: రష్యా కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-02-25T22:22:29+05:30

రష్యా దళాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతూ రాజధాని కీవ్‌కు దాదాపు సమీపించిన వేళ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: రష్యా దళాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతూ రాజధాని కీవ్‌కు దాదాపు సమీపించిన వేళ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ఆర్మీ కనుక ఆయుధాలు విడిచిపెడితే చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈశాన్య, తూర్పు వైపుల నుంచి రష్యా సైన్యం కీవ్‌ను చుట్టుముడుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


 అంతకుముందు ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ మాట్లాడుతూ.. చెర్నోబిల్ ఎక్స్‌క్లూజన్ జోన్, చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణాలను రష్యన్ సేనలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీడియా కథనాలను బట్టి ఉక్రెయిన్ ఇక రష్యా చేతికి చిక్కినట్లేనని తెలుస్తోంది.


కీవ్‌లోకి రష్యన్ బలగాలు ఇప్పటికే చేరుకున్నాయని, మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పూర్తిగా రష్యా వశమవుతుందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో తనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం.  


Updated Date - 2022-02-25T22:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising