ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధం మాటున వివక్ష !

ABN, First Publish Date - 2022-03-05T07:05:14+05:30

ఉక్రెయిన్‌లో జాతి వివక్ష యుద్ధం చాటున అగ్గిరాజేస్తోం ది. యుద్ధం వల్ల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌లో వివక్ష ఎదుర్కొంటున్న విదేశీయులు

కీవ్‌, మార్చి 4 : ఉక్రెయిన్‌లో జాతి వివక్ష యుద్ధం చాటున అగ్గిరాజేస్తోం ది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌ ప్రజలు సహా అక్కడి విదేశీయులు సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే, సరిహద్దులు దాటే క్రమంలో పలుచోట్ల ఉక్రెయినేతరులు జాతి వివక్షకు గురవుతున్నారు. అక్కడి సిబ్బంది ఉక్రెయినేతరుల పట్ల చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భారతీయులు, ఆఫ్రికన్లను తుపాకీ చూపెట్టి బెదిరించడం, లాఠీలతో కొట్టడం, వాహనాలతో తొక్కించడం వంటి చర్యలకు పాల్పడినట్లు వార్తలొచ్చాయి. అంతేకాక వసతుల కల్పన, తరలింపు అంశాల్లోను చిన్నచూపు చూస్తున్నారు. సరిహద్దులకు వెళ్లే క్రమంలో తమను రైళ్లు, బస్సులు ఎక్కేందుకు అనుమతించడం లేదని పలువురు భారతీయులు సోషల్‌ మీడియా ద్వారా అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. మరోపక్క, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ వార్తలను ప్రసారం చేస్తున్న పలు విదేశీ మీడియా చానళ్లపైనా సోషల్‌ మీడియాలో విమర్శలొస్తున్నాయి.  

Updated Date - 2022-03-05T07:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising