ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యంలో పురుగులు

ABN, First Publish Date - 2022-01-28T15:47:09+05:30

మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపం ఒదవం తాంగుడి గ్రామంలో సుమారు 450 మందికి పైగా వ్యవసాయ కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరు అదే ప్రాంతంలోని రేషన్‌ దుకాణంలో ఉచిత బియ్యం తీసుకుంటారు. గురువారం తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - రోడ్డుపై పోసి ప్రజల ఆందోళన


ఐసిఎఫ్‌(చెన్నై): మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపం ఒదవం తాంగుడి గ్రామంలో సుమారు 450 మందికి పైగా వ్యవసాయ కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరు అదే ప్రాంతంలోని రేషన్‌ దుకాణంలో ఉచిత బియ్యం తీసుకుంటారు. గురువారం తీసుకున్న బియ్యంలో పురుగులు ఉండడాన్ని గుర్తించిన ప్రజలు, బియ్యాన్ని రోడ్డుపై పోసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూలీపనులు చేసుకొనే తాము రేషన్‌ దుకాణంలో ఇచ్చే బియ్యంతోనే అన్నం తింటున్నామని, కొద్ది నెలలుగా బియ్యంలో పురుగులు వస్తున్నాయని, ఈ విషయాన్ని రేషన్‌ ఉద్యోగులకు తెలిపినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రస్తుతం అందజేసిన బియ్యంలో అధికంగా పురుగులున్నాయని, వీటితో అన్నం తినలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ చేపడతామని రెవెన్యూ అధికారుల హామీతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు.

Updated Date - 2022-01-28T15:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising