ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rath Yatra 2022 : పూరి బీచ్‌లో 125 సైకత రథాలు.. సుదర్శన్ పట్నాయక్ సృజనాత్మకతకు వారెవా అనాల్సిందే..

ABN, First Publish Date - 2022-07-02T00:29:46+05:30

ఒడిశా(Odisha)కు చెందిన ప్రముఖ సైకత శిల్పి(Sand Artist) సుదర్శన్ పట్నాయక్(Sudarsan Pattnaik) మరో సృజనాత్మకత కళఖండాన్ని సృష్టించాడు. ‘జగన్నాథ రథయాత్ర 2022’ (Rath Yatra 2022) పురస్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ : ఒడిశా(Odisha)కు చెందిన ప్రముఖ సైకత శిల్పి(Sand Artist) సుదర్శన్ పట్నాయక్(Sudarsan Pattnaik) మరో సృజనాత్మకత సైకత కళఖండాన్ని ఆవిష్కరించాడు.  ‘జగన్నాథ రథయాత్ర 2022’ (Rath Yatra 2022) పురస్కరించుకుని పూరి బీచ్‌(Puri Beach)లో 125 ఇసుక రథాల(Sand Chariots)ను తీర్చిదిద్దాడు. వారెవా.. అనిపించేలా ఉన్న ఈ అద్భుత దృశ్యం ఫొటోని ‘జై జగన్నాథ’ క్యాప్షన్‌తో ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘‘ శుభప్రదమైన రథయాత్ర సందర్భంగా నా సైకత కళాఖండం ఇది’’ అని పేర్కొన్నాడు. శోభాయమానంగా నిర్వహించే పూరి జగన్నాథ రథయాత్రను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన 125 ఇసుక రథాలు ఇందులో కనిపించాయి.


రథయాత్ర సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మరో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని వాడబోమని, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని రథయాత్ర సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలంటూ పిలుపునిచ్చాడు. ఈ పోస్టుకి నెటిజన్ల మంచి స్పందన లభిస్తోంది. ఫాలోయర్స్ లైక్స్‌తో తమ అభినందనలు తెలియజేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వందలాది మంది ‘జై జగన్నాథ’ అంటూ రీట్విట్ చేస్తున్నారు.


పూరి జగన్నాథ రథయాత్రను ఒడిశాలో నిర్వహించే ఆధ్యాత్మికత వేడుకే అయినా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్సావాలను వైభవంగా నిర్వహిస్తారు. పూరి జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు దేవీ సుభద్ర, బాలభద్ర.. గుండిచ దేవాలయానికి 9 రోజుల విడిదికి వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రథ యాత్రను చేపడతారు. జగన్నాథుడు, దేవీ సుభద్ర, బాలభద్రలు 3 ప్రత్యేక రథాల్లో ఆశీనులై ఉండగా మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ గుండిచ దేవాలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.


ప్రతి ఏడాది శుక్ల పక్షం రెండవ రోజున ఈ రథయాత్రను కన్నులపండువగా నిర్వహిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం జూన్ లేదా జులై నెలల్లో జరిగే ఈ యాత్ర ఈ ఏడాది జులై 1న ఆరంభమైంది. కాగా పవిత్ర పూరిజగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఒడిశా గవర్నర్ గనేషి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తోపాటు పలువురు ప్రముఖులు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.



Updated Date - 2022-07-02T00:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising