ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Navneet Rana: అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు రాణా దంపతులకు ఏడు రోజుల గడువు

ABN, First Publish Date - 2022-05-21T22:08:12+05:30

తమ ఫ్లాట్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమరావతి ఎంపీ నవనీత్ రాణా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: తమ ఫ్లాట్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. అనుమతి లేని ఆ నిర్మాణాలను వారం రోజుల్లోగా తొలగించాలని, లేదంటే తదుపరి బీఎంసీ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎంసీ ఇటీవల కూడా ఇలాంటి నోటీసులను రెండుసార్లు పంపింది.  


నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా అందులో పేర్కొన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించిన అధికారులు.. ఒకవేళ అలా చేయని పక్షంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బీఎంసీనే ఆ పని చేస్తుందని హెచ్చరించింది. నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారుల నుంచి పొందిన అనుమతులు, ఆమోదించిన ప్లాన్స్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించడంలో దాని యజమాని విఫలమయ్యారని పేర్కొన్న అధికారులు.. కాబట్టి దానిని అనధికారిక నిర్మాణంగానే పరిగణిస్తామని, కూల్చివేతకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. 

Updated Date - 2022-05-21T22:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising