ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramalinga Reddy: బెటర్‌ బెంగళూరుపై 20 రోజుల్లో సమగ్ర నివేదిక

ABN, First Publish Date - 2022-09-16T18:10:26+05:30

దేశ ఐటీ బీటీ రాజధానిగా విలసిల్లుతున్న సిలికాన్‌ వ్యాలీ బెంగళూరులో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చే దిశలో బెటర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - కేపీసీసీ కార్యాధ్యక్షుడు రామలింగారెడ్డి


బెంగళూరు, సెప్టెంబరు, 15(ఆంధ్రజ్యోతి): దేశ ఐటీ బీటీ రాజధానిగా విలసిల్లుతున్న  సిలికాన్‌ వ్యాలీ బెంగళూరులో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చే దిశలో బెటర్‌ బెంగళూరు సమగ్ర నివేదికను మరో 20 రోజుల్లో సమర్పించనున్నట్లు కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్‌.రామలింగారెడ్డి(Ramalinga Reddy) ప్రకటించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC President DK Sivakumar) ఇటీవల తన అధ్యక్షత బెటర్‌ బెంగళూరు యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసిందని నగరంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని వారిచ్చే అమూల్యమైన సలహా సూచనలను క్రోడీకరించి నివేదికను సిద్ధం చేస్తానన్నారు. ఈ నివేదిక ఆధారంగా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల్లో పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఈ దిశలో నగరంలోని మొత్తం 28 శాసనసభా నియోజకవర్గాల్లోనూ విస్త్రృతంగా పర్యటిస్తామన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బెంగళూరు నగర ప్రతిష్ట బాగా పెరిగిందని బీజేపీ పాలనలో అంతర్జాతీయ స్థాయిలో నగర ప్రతిష్ట మంటగలిసిందన్నారు. ఆడలేక మ ద్దెల ఓడు అన్నట్లు బెంగళూరులో మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైన బీజేపీ దానిని కాంగ్రెస్‌పై నెట్టేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎవరో నగర మౌలిక సదుపాయలను కల్పించే విషయంలో విఫలమైందెవరో నగర ప్రజలందరికీ తెలుసునన్నారు.   బెటర్‌ బెంగళూరు కమిటీలో ఉన్న సభ్యులంతా చాలా అపార అనుభవం కలిగిన వారని నగర సమస్యలపై అవగాహన ఉన్నవారని రామలింగారెడ్డి పేర్కొన్నారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికెకు గడువు ముగిసిన తక్షణం ఎన్నికలు నిర్వహించి  ఉంటే సమస్య తీవ్రత ఇంతగా ఉం డేది కాదన్నారు. ఓటమి భయంతోనే బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించేందుకు వెనుకాడుతోందని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-16T18:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising