ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajya Sabha ఉప ఎన్నికల్లో ఐదుగురు బీజేపీ అభ్యర్థుల ఖరారు

ABN, First Publish Date - 2022-03-19T17:40:24+05:30

మార్చి 31వతేదీన జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మార్చి 31వతేదీన జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.అస్సాం, హిమాచల్, త్రిపుర, నాగాలాండ్‌లకు చెందిన భారతీయ జనతా పార్టీ ఐదుగురు రాజ్యసభ నామినీలను ప్రకటించింది.అస్సాం నుంచి పబిత్రా మార్గరీటా, హిమాచల్ ప్రదేశ్ నుంచి సికందర్ కుమార్, త్రిపుర నుంచి మానిక్ సాహా,నాగాలాండ్ నుంచి ఎస్. ఫాంగ్నోన్ కొన్యాక్ పేర్లను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది.శనివారం  యునైటెడ్ పీపుల్స్ పార్టీ - లిబరల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగ్వ్రా నార్జారీ అసోం రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. అసోంలో యూపీపీఎల్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంది.


తమ పార్టీ అభ్యర్థిని సంకీర్ణ భాగస్వామి అయిన బీజేపీ రాజ్యసభకు అభ్యర్థిగా ప్రకటించినందుకు యూపీపీఎల్ అధ్యక్షుడు ప్రమోద్ బోరో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు కేరళ నుంచి జేబీ మాథర్, అసోం నుంచి రిపున్ బోరాలను కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఓటింగ్ జరగనుంది. వీటిలో కేరళ నుంచి మూడు, అస్సాం నుంచి రెండు, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురల నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి.


Updated Date - 2022-03-19T17:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising