ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajya Sabha: విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా

ABN, First Publish Date - 2022-07-18T19:02:42+05:30

విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. అగ్నిపథ్, జీఎస్టీ పన్నులపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. అగ్నిపథ్, జీఎస్టీ పన్నులపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభ చైర్మన్‌ పోడియం ఎదుట విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలు చేశారు. ప్రజాసమస్యలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో అగ్నిపథ్పై చర్చకు విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. రూల్ 267 కింద సీపీఐ, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు బినోయ్ విశ్వం, శక్తిసిన్హ్ గోహిల్ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అగ్నిపథ్ పథకంపై చర్చకు డిమాండ్ చేశారు.



ధరల పెరుగుదలపై అటు లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సిలిండర్, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. ఇదిలా ఉండగా.. రాజ్యసభ సభ్యులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులుగా రచయిత విజయేంద్రప్రసాద్, విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్, రణదీప్‌సింగ్, పి.చిదంబరం ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - 2022-07-18T19:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising