ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajeev జ్యోతి సద్భావన యాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-21T16:33:13+05:30

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్‌ స్మారక జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) ఆధ్వర్యంలో వంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్‌ స్మారక జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) ఆధ్వర్యంలో వంద ద్విచక్రవాహనాలతో చేపట్టిన ఈ యాత్రను కన్నియాకుమారి ఎంపీ విజయ్‌ వసంత్‌, టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ జిల్లా నిర్వాహకులు కమలిక కామరాజ్‌, టీవీ భాస్కర్‌, కౌన్సిలర్‌ కీర్తి తదితరులు పాల్గొన్నారు. తొరువొత్తియూర్‌ నుంచి బయల్దేరిన ఈ యాత్ర రాయపురం, ఆర్‌కే నగర్‌, సైదాపేట, పోరూర్‌, పూందమల్లి మీదుగా శనివారం ఉదయం 6 గంటలకు శ్రీ పెరుంబుదూర్‌లోని రాజీవ్‌ స్మారక స్థలికి చేరుకుంటుంది. అక్కడ టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, పార్టీ నాయకులు స్వాగతం పలుకనున్నారు. అక్కడ నుంచి పలు రాష్ట్రాల మీదు గా మూడు నెలల అనంతరం ఢిల్లీ చేరుకొని ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాజీవ్‌ స్మారక జ్యోతి అందజేయను న్నట్లు కె.చిరంజీవి తెలిపారు.

Updated Date - 2022-05-21T16:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising