ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీజీ.. మాట్లాడరెందుకు?: Udaipur murderపై CM గెహ్లోత్

ABN, First Publish Date - 2022-06-29T01:01:41+05:30

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్యపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, సిగ్గుచేటని అన్న ఆయన.. దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో దేశాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్యపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, సిగ్గుచేటని అన్న ఆయన.. దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో దేశాన్ని ఉద్దేశించి ప్రధాని కానీ, అమిత్ షా కానీ ఎందుకు మాట్లాడటం లేదని, ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో వారి మౌనం ఆరోగ్యకరం కాదని ఆయన అన్నారు. ‘‘దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువకుడిని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని తాము ఖండిస్తున్నాను. అయితే ప్రధాని కానీ హోంమంత్రి కానీ దేశాన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడటం లేదు? ప్రజల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి ఉన్మాదాల్ని క్షమించబోమని, శాంతియుతంగా ఉండమని ప్రజలకు గట్టి సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వాలి’’ అని గెహ్లోత్ అన్నారు.


నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసిన ఓ యువకుడు మంగళవారంనాడు దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని ఇద్దరు అగంతులు తలనరికి మరీ చంపారు. ఉదయ్‌పూర్‌లోని మాల్డాస్ స్ట్రీట్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల్డాస్ స్ట్రీట్ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అదనంగా 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు. మరోవైపు, ఈ దారుణానికి పాల్పడిన అగంతకులు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యను గొప్పగా చెప్పుకోవడంతో పాటు ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందంటూ ఆ వీడియోలో హెచ్చరించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-06-29T01:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising