ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెగా ర్యాలీ నిర్వహించిన రాజ్ థాకరే

ABN, First Publish Date - 2022-05-02T02:27:44+05:30

మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాకరే ఔరంగాబాద్‌లో ఆదివారంనాడు మెగా ర్యాలీ నిర్వహించారు. కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య ఈ ర్యాలీకి అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


కాగా, ఎంఎన్ఎస్ వ్యూహాత్మకంగానే ర్యాలీ సమయాన్ని ఎంచుకున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముంబైలోని థానే, నవీ ముంబై, పుణె, పింప్రి-చించ్వాడ్, ఔరంగాబాద్ తదితరల మున్సిపాలటీలకు త్వరలో ఎన్నికలు  జరుగనుండటం, 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే భారీ ర్యాలీకి రాజ్‌థాకరే ముందుగా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అటు బీజేపీ, ఇటు శివసేన హిందుత్వ వాదాన్ని చాటుకుంటున్న తరుణంలో లౌడ్‌స్పీకర్ వివాదాన్ని లేవనెత్తడం ద్వారా తాము సైతం అదే బాటులో వెళ్తునట్టు ఎంఎన్ఎస్ చెప్పే ప్రయత్నం చేసిందంటున్నారు. బీజేపీతో భవిష్యత్ ‌పొత్తులకు ఉన్న అవకాశంపై ఎంఎన్ఎస్ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఆ అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ క్రమంలో ఎంఎన్ఎస్ ర్యాలీకి షరతులపై ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. సీసీటీవీలు, డాగ్ స్క్వాడ్‌లు, మెటల్ డిటెక్టర్లు, డోన్లతో నిఘా వంటి ఏర్పాట్లు చేశారు. కాగా, జూన్ 5న అయోధ్యలో పర్యటించనున్నట్టు, రామాలయంలో పూజలు నిర్వహించనున్నట్టు రాజ్ ఇప్పటికే ప్రకటించారు.

Updated Date - 2022-05-02T02:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising