ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agnipath protests: రైల్వేలకు రూ.259.44 కోట్ల నష్టం

ABN, First Publish Date - 2022-07-23T00:53:40+05:30

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకానికి (Agnipath Scheme) వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Aswini Vaishnav) బుధవారంనాడు రాజ్యసభకు (Rajya sabha) ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సామూహిక నిరసనలు జరిగాయి. బీహార్ నుంచి తెలంగాణ వరకూ రైల్వే ఆస్తులపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే బాగా నష్టపోగా, యూపీలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసలు వ్యక్తమయ్యాయి. ఈ ఆందోళనల కారణంగా జూన్ 15 నుంచి జూన్ 23 వరకూ 2132 పైగా రైళ్లు రద్దయ్యాయని మంత్రి తెలిపారు. రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులకు సొమ్ము తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక డాటాను నిర్వహించామన్నారు. జూన్ 14 నుంచి 30వ తేదీ వరకూ రూ.102 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశామని చెప్పారు. ఆ సమయంలో రద్దయిన రైలు సర్వీసులన్నింటినీ తిరిగి పునరుద్ధరించినట్టు వివరించారు.

Updated Date - 2022-07-23T00:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising