ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని మార్గాల్లో వందే భారత్ Expressలు

ABN, First Publish Date - 2022-05-21T14:05:33+05:30

అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఐసీఎఫ్‌ కర్మాగారంలో తయారు చేయడం అభినందనీయనమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ కొనియాడారు. శుక్రవారం ఉదయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - Railway Minister అశ్విన్‌ వైష్ణవ్‌


చెన్నై: అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఐసీఎఫ్‌ కర్మాగారంలో తయారు చేయడం అభినందనీయనమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ కొనియాడారు. శుక్రవారం ఉదయం ఆయన ఐసీఎఫ్ లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్‌ ఎల్‌హెచ్‌బీ కొచ్‌లను జెండా ఊపి ప్రారంభించారు.మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ లను నడుపనున్నామని ఆయన ప్రకటించారు. దక్షిణ రైల్వే అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలందించటంలో అన్న జోన్ల కంటే ముందున్నారని ప్రశంసించారు. ఐసీఎఫ్ లో తయారయ్యే బోగీలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయన్నారు. ఈ కర్మాగారంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను తయారు చేయడం దక్షిణ రైల్వే చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐసీఎఫ్‌ కర్మాగారంలో నవీన సాంకేతిక పద్ధతులతో ప్రయాణికులకు మెరుగైన వసతులతో బోగీలను తయారు చేస్తున్నారంటూ ఉద్యోగులను అభినందించారు. దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఏకే అగర్వాల్‌, ఐసీఎఫ్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ ఎస్‌.శ్రీనివాస్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ పీయూకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ పరిశీలించి అక్కడి కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆయన కాసేపు చర్చించారు. అనంతరం స్టేషన్‌లోని కాంచీపురం పట్టు వస్త్రాల దుకాణాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైల్వేను ప్రైవేటు పరం చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఎగ్మూరు, కాట్పాడి, మదురై, కన్నియాకుమారి, రామేశ్వరం సహా దేశంలోని 30 రైల్వేస్టేషన అభివృద్ధికి రూ.865 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేసే రైల్వే ఉద్యోగులందరికీ ప్రాంతీయ భాష తెలిస్తే మంచిదని ఆయన సూచించారు.

Updated Date - 2022-05-21T14:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising