ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: రాజీవ్‌ స్మారకస్థలిలో నేడు రాహుల్‌ నివాళి

ABN, First Publish Date - 2022-09-07T15:44:50+05:30

కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌(Kanniyakumari to Kashmir) వరకు పాదయాత్ర నిర్వహించేందుకు విచ్చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌(Kanniyakumari to Kashmir) వరకు పాదయాత్ర నిర్వహించేందుకు విచ్చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ముందుగా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారక స్థలివద్ద నివాళులర్పించనున్నారు. పదిహేను సంవత్సరాల క్రితం రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక శ్రీపెరుంబుదూరు(Sriperumbudur)లోని రాజీవ్‌స్మారకస్థలి వద్ద నివాళులర్పించేందుకు వెళ్ళారు. ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే ప్రియాంక తండ్రి మరణాన్ని తలచుకుని బోరున విలపించారు. ఆమెను ఓదార్చటం రాహుల్‌కు కష్టసాధ్యమైంది. దీంతో ఇద్దరూ స్మారక స్థలి లోపలకు వెళ్ళకుండా తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ తన తండ్రి అశువులు బాసిన స్మారకస్థలి వద్ద తొలిసారిగా నివాళులర్పించేందుకు వెళ్తున్నారు. బుధవారం ఉదయం రాజీవ్‌స్మారకస్థలి చేరుకుని నివాళులర్పించి అక్కడే గంటసేపు ఆయన ధ్యానం చేయనున్నారు.

Updated Date - 2022-09-07T15:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising