ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress సిద్ధాంతాలపై ప్రచారం చేయండి

ABN, First Publish Date - 2022-03-01T13:56:48+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలపరచాలని, అందుకు పార్టీ సిద్ధాంతాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో, అంతకు ముందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - స్థానిక విజేతలకు Rahul పిలుపు


చెన్నై: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలపరచాలని, అందుకు పార్టీ సిద్ధాంతాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో, అంతకు ముందు జరిగిన స్థాని క సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన కొత్త కౌన్సిలర్లు సహా 900 మంది ప్రతినిధులతో ఆయన రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి అధ్య క్షత వహించారు. రాహుల్‌ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలం క్రమంగా పెరుగుతోందని సభకు హాజరైన పార్టీ ప్రజాప్రతి నిధుల సంఖ్యను బట్టి తెలుస్తోందన్నారు. కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు తదితర స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకు నేందుకు అవకాశాలున్నాయని, ఈ రాష్ట్రంలో పార్టీ బలపడితేదేశమంతటా బలపడినట్లేనన్నారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలపై రాష్ట్రమంతా ప్రచారం చేసి పార్టీని అభివృద్ధిపరచాలని ఆయన కోరారు. స్టాలిన్‌ పుస్తకావిష్కరణ కోసం చెన్నై వచ్చిన రాహుల్‌కు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. 



Updated Date - 2022-03-01T13:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising