ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hilarious moment: భారత్ జోడో యాత్రలో రాహుల్ పెళ్లి ప్రస్తావన

ABN, First Publish Date - 2022-09-11T20:43:45+05:30

రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన వివాహం అంశం తెరపైకి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన వివాహం అంశం తెరపైకి వస్తుంటుంది. రాజకీయ నేతల్లో ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రాహుల్ గాంధీ ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా నవ్వుతూ  విషయం దాటేస్తుంటారు. భారత్ జోడో యాత్రలో తలమునకలై ఉన్న రాహుల్‌కు ఊహించని విధంగా ఈ ప్రశ్న ఎదురైంది. ''హిలేరియస్ మూమెంట్'' (Hilarious moment) అనే క్యాప్షన్‌తో ఇందుకు సంబంధించిన ఫోటోను కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.


భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మహిళా ఎంజీఎన్‌ఆర్ఈజీఏ (MGNREGA) వర్కర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. రాహుల్ ఊహించని విధంగా ఓ పెద్దావిడ ''బాబూ నీ పెళ్లెప్పుడు'' అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఎంత ప్రేమో తమకు తెలుసునని, రాహుల్ ఒప్పుకుంటే ఒక మంచి తమిళ అమ్మాయిని చూస్తామని ఆమె చెప్పడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా అహ్లాదంగా మారిపోయింది. రాహుల్ సైతం ఊహించని ప్రశ్నకు ఆశ్చర్యపడుతూనే, వెంటనే తేరుకుని చిరునవ్వులు చిందించారు. రాహుల్ గాంధీ మూడో రోజు భారత్ జోడో యాత్రలో చోటుచేసుకున్న ఈ అహ్లాదకరమైన  క్షణాలు వీక్షించండంటూ జైరాం రమేష్ తన ట్వీట్‌లో తెలిపారు. కన్యాకుమారిలో ప్రారంభమై కశ్మీర్‌ వరకూ ఈ ఐక్యతా యాత్రను రాహుల్ సాగించనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 150 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

Updated Date - 2022-09-11T20:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising