ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 lakh jobs promise : ఇది మహా బూటకం : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-06-15T01:01:01+05:30

రానున్న ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రానున్న ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మహా బూటకమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇది కేవలం బూటకపు ప్రభుత్వం కాదని, మహా బూటకపు ప్రభుత్వమని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఆయన ఈ విధంగా స్పందించారు. 


నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని మంగళవారం (రెండో రోజు) కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో రాహుల్ ఘాటుగా స్పందిస్తూ, ఓ ట్వీట్ చేశారు. 


‘‘ఏటా రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానంతో ఎనిమిదేళ్ళ క్రితం యువతను మోసగించినట్లుగానే, ఇక ఇప్పుడు 10 లక్షల ప్రభుత్వోద్యోగాల వంతు వచ్చింది. ఇది కేవలం బూటకపు వాగ్దానాల ప్రభుత్వం మాత్రమే కాదు, మహా బూటకపు వాగ్దానాల ప్రభుత్వం. ప్రధాన మంత్రి గారు ఉద్యోగాలను సృష్టించడంలో కాదు, ఉద్యోగాల మీద వార్తలు సృష్టించడంలో నిపుణుడు’’ అని రాహుల్ ఆరోపించారు. 


అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల పరిస్థితిని సమీక్షించిన తర్వాత, రానున్న ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని వివిధ ప్రభుత్వ శాఖలకు Prime Minister Narendra Modi ఆదేశాలిచ్చినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. 


Updated Date - 2022-06-15T01:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising