ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దుల్లో జరుగుతున్నది భారీ లోపం : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-01-07T23:49:32+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. మన దేశ సరిహద్దుల్లో అతి పెద్ద భద్రతా లోపం ఉందని ఓ ట్వీట్‌లో ఆరోపించారు. దీని గురించి పీఎం మోదీ ఎప్పుడైనా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. #PangongTso #China అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఇచ్చారు. 


పాంగాంగ్ సరస్సుపై ఓ వంతెనను చైనా నిర్మిస్తోందని వార్తా కథనాలు రావడంతో వివాదం చెలరేగుతోంది. దీనిపై భారత ప్రభుత్వం గురువారం స్పందిస్తూ, తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై చైనా ఓ వంతెనను నిర్మిస్తోందని, దాదాపు 60 సంవత్సరాల నుంచి చైనా దురాక్రమణలో ఉన్న భూభాగంలో ఈ వంతెనను నిర్మిస్తోందని తెలిపింది. తాము చైనా చర్యలను ఎన్నడూ ఆమోదించబోమని తెలిపింది. 


మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సమయంలో భద్రతాపరమైన లోపం జరిగినట్లు వివాదం రేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ సంఘటనపై దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు. 


Updated Date - 2022-01-07T23:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising