ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలపుంతలో వింత వస్తువు

ABN, First Publish Date - 2022-01-28T08:50:21+05:30

పాలపుంతలో గిరగిరా తిరుగుతున్న ఓ వింత వస్తువును ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలోని ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనుగొన్న వస్తువుల కంటే ఇది భిన్నంగా ఉందని వారు చెబుతున్నారు. పరిశోధనా వ్యాసం కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి 18 నిమిషాలకు రేడియో సిగ్నల్స్‌


సిడ్నీ, జనవరి 27: పాలపుంతలో గిరగిరా తిరుగుతున్న ఓ వింత వస్తువును ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలోని ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనుగొన్న వస్తువుల కంటే ఇది భిన్నంగా ఉందని వారు చెబుతున్నారు. పరిశోధనా వ్యాసం కోసం అధ్యయనం చేస్తున్న కర్టిన్‌ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థి దీనిని కనుగొన్నారు. ఈ వస్తువు నుంచి గంటకు మూడుసార్లు రేడియోధార్మిక శక్తి వెలువడుతోంది. సరిగ్గా ప్రతి 18.18 నిమిషాలకు దీని నుంచి రేడియో తరంగాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని మర్చిసన్‌ వైడ్‌ఫీల్డ్‌ అరే టెలీస్కోప్‌తో దీనిని గుర్తించారు. ఇదిభూమి నుంచి సుమారు 4వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని అంచనా వేశారు. అత్యంత ప్రకాశవంతంగా ఉన్న దీని చుట్టూ బలమైన అయస్కాంత క్షేత్రం ఉందంటున్నారు. ఇది హైడ్రోజన్‌ అంతా మండిపోయిన నక్షత్రం లేదా కూలిపోయిన నక్షత్రంలోని భాగం అయి ఉంటుందని భావిస్తున్నారు. విశ్వంలో మరే వస్తువుకూ ఇలాంటి ప్రత్యేకత లేదని.. టైమ్‌ సెట్‌ చేసి పెట్టినట్టు సరిగ్గా ప్రతి 18 నిమిషాలకు రేడియో తరంగాలు విడుదలవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2022-01-28T08:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising