ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Qutub Minar Case: జూన్ 9వ తేదీకి తీర్పు రిజర్వ్

ABN, First Publish Date - 2022-05-25T01:23:26+05:30

కుతుబ్ మినార్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ధ్వంసం చేసిన 27 ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కుతుబ్ మినార్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ధ్వంసం చేసిన 27 ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ కోర్టు జూన్ 9వ తేదీకి రిజర్వ్ చేసింది. మంగళవారంనాడు ఢిల్లీలోని సాకేత్ కోర్టులో దీనిపై విచారణ జరిపింది. ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన హిందూ పిటిషన్లను భారత పురావస్తు శాఖ (Archaeological Survey of India- ASI) ఈ సందర్భంగా వ్యతిరేకింది.


కుతుబ్ మినార్ 1914వ సంవత్సరం నుంచి రక్షిత స్మారక చిహ్నంగా ఉందని, దీని నిర్మాణాన్ని ఇప్పుడు మార్చలేమని ఏఎస్ఐ పేర్కొంది. హిందూ పిటిషనర్ల అభ్యర్థన 1958 యాక్ట్ నిబంధనలకు  విరుద్ధమని ఆర్కియాలజీ శాఖ తెలిపింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ రక్షిత స్థలమని, ఇందులో పూజలు చేసే హక్కు ఎవరికీ లేదని అధికారులు కోర్టుకు నివేదించారు. కాగా,  కుతుబ్ మినార్ రాజా విక్రమాదిత్య నిర్మించారని, దీనికి విష్ణు స్తంభం అని పేరని కొద్దికాలంగా వీహెచ్‌పీ వాదిస్తోంది.

Updated Date - 2022-05-25T01:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising