ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Queen Elizabeth II : బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన

ABN, First Publish Date - 2022-09-08T23:32:33+05:30

బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) ఆరోగ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటాలని సిఫారసు చేశారు. ఈ వివరాలను బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం వెల్లడించింది. ఆమె ఈ నెల 6న ఆ దేశ నూతన ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ (Liz Truss) చేత ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. 


96 సంవత్సరాల వయసుగల క్వీన్ ఎలిజబెత్-2కు గత ఏడాది అక్టోబరు నుంచి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. నిల్చోవడానికి, నడవడానికి ఆమె చాలా ఇబ్బందిపడుతున్నారు. బుధవారం ఆమె ప్రీవీ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేశారు. 


క్వీన్ ఆందోళనగా లేరని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటన పేర్కొంది. ఆమె వేసవి కాలంలో స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కేజిల్‌లో గడిపారని, ప్రస్తుతం అక్కడే ఉన్నారని వివరించింది.  


ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ (Liz Truss) స్పందిస్తూ, యావత్తు దేశం ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నారు. ‘‘బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ఈ లంచ్‌టైమ్‌లో వచ్చిన వార్తతో యావత్తు దేశం తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ సమయంలో నాతోపాటు యావత్తు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల ఆలోచనలు హెర్ మెజెస్టీ ది క్వీన్, ఆమె కుటుంబ సభ్యుల గురించే’’ అని ఓ ట్వీట్‌లో తెలిపారు. 


లిజ్ ట్రస్ మంగళవారం బ్రిటన్ ప్రధాన మంత్రిగా క్వీన్ చేత నియమితులయ్యారు. ఈ కార్యక్రమం స్కాట్లాండ్‌లోని బల్మోరల్ ఎస్టేట్‌లో జరిగింది.


Updated Date - 2022-09-08T23:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising