ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Qatar Airways ఢిల్లీ-దోహా విమానంలో పొగ...పాక్‌కు దారి మళ్లింపు

ABN, First Publish Date - 2022-03-21T16:57:59+05:30

ఢిల్లీ నుంచి దోహా నగరానికి వెళుతున్న ఖతార్ ఎయిర్‌వేస్ ప్యాసింజర్ విమానంలో సోమవారం పొగ రావడంతో దాన్ని అత్యవసరంగా పాకిస్థాన్ దేశంలోని కరాచీకి మళ్లించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దోహా నగరానికి వెళుతున్న ఖతార్ ఎయిర్‌వేస్ ప్యాసింజర్ విమానంలో సోమవారం పొగ రావడంతో దాన్ని అత్యవసరంగా పాకిస్థాన్ దేశంలోని కరాచీకి మళ్లించారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఖతార్ విమానం కార్గో ప్రాంతంలో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అత్యవసరంగా ఈ ఖతార్ విమానాన్ని కరాచీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను అత్యవసరంగా మెట్లను ఉపయోగించి  కిందకు దించామని ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది. కరాచీ నుంచి దోహాకు ప్రయాణికులను తరలించడానికి రిలీఫ్ ఫ్లైట్ ఏర్పాటు చేశామని ఎయిర్ లైన్స్ తెలిపింది. 


తమ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఖతార్ ఎయిర్ వేస్ క్షమాపణలు చెప్పింది. మార్చి 21వతేదీన ఢిల్లీ నుంచి దోహాకు వెళ్లాల్సిన క్యూఆర్579 విమానం కార్గో హోల్డ్‌లో పొగలు కనిపించడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించి కరాచీకి మళ్లించామని ఖతార్ ఎయిర్‌వేస్ వివరించింది. 


Updated Date - 2022-03-21T16:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising