ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రత తొలగించిన మర్నాడే Punjabi Singer దారుణ హత్య

ABN, First Publish Date - 2022-05-30T00:28:03+05:30

సిద్ధూ 1993 జూన్‌ 17న మాన్సా జిల్లాలోని మూసెవాలలో జన్మించారు. మంచి రాపర్ అయిన సిద్ధూకి మిలియన్ల సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు ఉణ్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ చేస్తున్న సమయంలోనే సిద్ధూ సంగీతం నేర్చుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబీ సింగర్(Punjabi Singer), కాంగ్రెస్ నేత సిద్ధూ మూసెవాలా(Sidhu Moosewala) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం పంజాబ్‌లోని జవహర్కే అనే గ్రామంలో సిద్ధూని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పంజాబ్‌లోని 424 మందికి భద్రత ఉపసంహరించిన మర్నాడే ఈ హత్య జరగడం గమనార్హం. వీఐపీ కల్చర్‌ను తగ్గించడంలో భాగంగా పలువురికి భద్రత తొలగిస్తున్నట్టు భగవంత్ మాన్‌సింగ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


సింగర్ సిద్ధూ మొన్న జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Punjab assembly election) కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాగా, ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా(AAP candidate Vijay Singla) చేతిలో 63,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 


గత నెలలో సిద్ధూ రూపొందించిన స్కేప్‌గోట్(Scapegoat) అనే పాట వల్ల సిద్ధూ మద్దతుదారులు ఆప్ కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది. ఆప్ మద్దతుదారులను ద్రోహులు అంటూ తన పాటలో సిద్ధూ ప్రస్తావించడం ఈ వివాదానికి దారి తీసింది. సిద్ధూ 1993 జూన్‌ 17న మాన్సా జిల్లాలోని మూసెవాలలో జన్మించారు. మంచి రాపర్ అయిన సిద్ధూకి మిలియన్ల సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు ఉణ్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ చేస్తున్న సమయంలోనే సిద్ధూ సంగీతం నేర్చుకున్నారు. అనంతరం పై చదువుల కోసం కెనడాకు వెళ్లారు. పంజాబ్‌లోని అత్యంత వివాదాస్ప సింగర్లలో సిద్ధూ ఒకరు. గ్యాంగ్‌స్టర్లను పొగడడం, గన్ కల్చర్‌ను ప్రమోట్ చేయడం లాంటివి సిద్ధూ అనేకం చేశారు. 2019 సెప్టెంబర్‌లో వచ్చిన ‘జట్టి జోనె మోర్హ్ ది బందూక వార్గి’ అనే పాట తీవ్ర వివాదమైంది. 18వ శతాబ్దపు సిక్కు వీరుడు మై భాగోపై రాసిని పాట ఇది. అయితే ఈ పాట రాసి పాడినందుకు సిద్ధూ క్షమాపణ చెప్పారు.

Updated Date - 2022-05-30T00:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising