ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీకి తగిన సమాధానం చెప్తాం: పంజాబ్ సీఎం చన్నీ

ABN, First Publish Date - 2022-01-19T23:36:33+05:30

ఈడీ రైడ్ విషయమై చన్నీ మాట్లాడుతూ ‘‘ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను మాపైకి కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పుతోంది. పశ్చిమ బెంగాల్, పంజాబ్ విప్లవాత్మక రాష్ట్రాలు. ఒకవేళ మమ్మల్ని అణచాలని చూస్తే ప్రతి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు వాడుకుంటోందని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. తాజాగా చన్నీ మేనల్లుడి ఇంట్లో ఈడీ రైడ్ చేసింది. పెద్ద మొత్తంలో నగదు, కోట్ల విలువ చేసే ఇతర సామాగ్రిని సీజ్ చేసింది. కాగా, ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీ పర్యటన రివేంజ్ ఇలా తీర్చుకుంటున్నట్లు రైడ్ల సమయంలో ఈడీ తమ కుటుంబ సభ్యులతో చెప్పినట్లు చన్నీ ఆరోపించారు. అయితే ఢిల్లీ తమను అణచివేయాలని చూస్తే తిరిగి అదే స్థాయిలో సమాధానం చెప్తామని చన్నీ హెచ్చరించారు.


ఈడీ రైడ్ విషయమై చన్నీ మాట్లాడుతూ ‘‘ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను మాపైకి కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పుతోంది. పశ్చిమ బెంగాల్, పంజాబ్ విప్లవాత్మక రాష్ట్రాలు. ఒకవేళ మమ్మల్ని అణచాలని చూస్తే ప్రతి సమాధానం కూడా అలాగే ఉంటుంది. మోదీ ఫిరోజ్‌పూర్ పర్యటనకు ఇది రివేంజ్‌ని ఈడీ అధికారులు అన్నట్లు నాకు తెలిసింది. నా అల్లుడిని 24 గంటలు విచారించారు. కానీ వారికి ఒక్క ఆధారం కూడా లభించలేదు’’ అని చన్నీ అన్నారు.

Updated Date - 2022-01-19T23:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising