ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన Punjab Sacrilege కేసు.. ముగ్గురికి మూడేళ్ల జైలు: తమ ఘనతగా చెప్పుకుంటున్న పార్టీలు

ABN, First Publish Date - 2022-07-09T01:15:04+05:30

ఏడేళ్లుగా కొనసాగుతున్న గురుగ్రంథ్ సాహిబ్ (Guru Granth Sahib) అపవిత్రత కేసుకు పంజాబ్‌ (Punjab)లోని మోగా (Moga) కోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ఏడేళ్లుగా కొనసాగుతున్న గురుగ్రంథ్ సాహిబ్ (Guru Granth Sahib) అపవిత్రత కేసుకు పంజాబ్‌ (Punjab)లోని మోగా (Moga) కోర్టు ముగింపు పలికింది. ఈ కేసులో ముగ్గురు డేరా సచ్చా సౌధా (Dera Sacha Sauda) మద్దతుదారులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఈ క్రెడిట్‌ తమదేనని చెప్పుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి.


2015లో పంజాబ్‌లో గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రం ఘటనలు చాలా జరగ్గా అందులో ఇదొకటి. కేసు తీర్పు వెలువడిన వెంటనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆ క్రెడిట్ తమదేనని పేర్కొంది. శిరోమణి అకాలీదళ్ (SAD), కాంగ్రెస్‌ (Congress) పాలనతో దుర్మార్గులకు దొరికిన రక్షణకు తెరపడిందని పేర్కొంది.


ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీతో కలిసి అకాలీదళ్ ప్రభుత్వంలో ఉండగా, 2017లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల వరకు పాలించింది. పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) వరుస ట్వీట్లు చేస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ (Bhagwant Mann) సారథ్యంలో న్యాయం విజయం సాధించిందని అన్నారు.


కొద్దికాలంపాటు డిప్యూటీ సీఎంగా ఉన్న కాంగ్రెస్ నేత సుఖ్‌జీందర్ సింగ్ రణ్‌ధావా మాట్లాడుతూ.. న్యాయం కోసం తమ పార్టీ చేసిన సుదీర్ఘ పోరాట ఫలితమే ఇదని పేర్కొన్నారు. అకాలీదళ్ కూడా ఆ ఘనత తమదేనని చెప్పుకునే ప్రయత్నం చేసింది. అప్పటి హోం మంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ కేసు దర్యాప్తునకు ‘సిట్’ను ఏర్పాటు చేశారని, దోషులకు ఇప్పుడు శిక్ష పడడానికి అదే కారణమని అన్నారు.  

Updated Date - 2022-07-09T01:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising