ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cong leader అల్కాలాంబాకు పంజాబ్ పోలీసుల సమన్లు

ABN, First Publish Date - 2022-04-21T16:41:10+05:30

కాంగ్రెస్ నాయకురాలు అల్కాలాంబాకు పంజాబ్ పోలీసులు సమన్లు జారీ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు అల్కాలాంబాకు పంజాబ్ పోలీసులు సమన్లు జారీ చేశారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ పోలీసులు కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఏప్రిల్ 26న సదర్ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు రావాలని సమన్లు జారీ చేశారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అల్కా లాంబా ఢిల్లీ సీఎంపై చేసిన అవమానకర వ్యాఖ్యకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావాలని ఆమె ఇంటి గోడపై పోలీసులు నోటీసును అతికించారు.సీఎంపై చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు కోసం ఈ నెల 26వతేదీ లేదా అంతకుముందు సదర్ రూప్ నగర్ పోలీసుస్టేషనులో వ్యక్తిగతంగా హాజరుకావాలని అల్కాలాంబాకు పోలీసులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.


అల్కా లాంబాపై రూప్‌నగర్ పోలీసులు సీఆర్‌పీసీ, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, 1988లోని సెక్షన్ 125 కింద కూడా కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తారుమారు చేయకూడదని, కొన్ని ఆదేశాలను పాటించాలని లాంబాను పోలీసులు తన నోటీసులో కోరారు. ‘‘మీరు దర్యాప్తు బృందం ​​ముందు హాజరు కావడంలో విఫలమైతే,  నిర్బంధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం’’అని పోలీసులు హెచ్చరించారు.ఈ నోటీసుకు సంబంధించిన సమాచారాన్ని అల్కా లాంబా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు.


Updated Date - 2022-04-21T16:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising