ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ పోలీసులదే తప్పు...Blue Book అనుసరించడంలో విఫలం

ABN, First Publish Date - 2022-01-06T13:11:38+05:30

పంజాబ్ పోలీసులు ‘బ్లూ బుక్’ నిబంధనలను అనుసరించడంలో విఫలమయ్యారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసులు ‘బ్లూ బుక్’ నిబంధనలను అనుసరించడంలో విఫలమయ్యారని, నిరసనకారుల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయలేదని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు.స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) బ్లూ బుక్ ప్రధానమంత్రి రక్షణ కోసం భద్రతా మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది.భద్రతా వైఫల్యంపై ఇంటెలిజెన్స్ బ్యూరో పంజాబ్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.వీఐపీకి పూర్తి రక్షణ కల్పిస్తామని పంజాబ్ పోలీసులు హామీ ఇచ్చారు.


బ్లూ బుక్ ప్రకారం ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పంజాబ్‌లో జరిగిన ప్రతికూల పరిస్థితుల్లో, రాష్ట్ర పోలీసులు వీఐపీ రక్షణ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయాలని హోంశాఖ అధికారి చెప్పారు. పంజాబ్ పోలీసు అధికారులు వీఐపీకి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారని కేంద్ర అధికారి పేర్కొన్నారు.స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది ప్రధానమంత్రికి దగ్గరగా ఉంటారు, మిగిలిన భద్రతా చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఏదైనా ఆకస్మిక పరిణామాలు ఏర్పడిన సందర్భంలో రాష్ట్ర పోలీసులు వీఐపీల కదలికలను తదనుగుణంగా మార్చాలని అధికారి వివరించారు.ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పంజాబ్ పోలీసులు చేపట్టిన బందోబస్తు, పికెట్లు, రూఫ్‌టాప్ లపై జవాన్ల మోహరింపు, బారికేడ్‌ల ఏర్పాటు ఇతర భద్రతా చర్యల వివరాలను పంపించాలని కేంద్ర హోంశాఖ బృందం కోరింది. 


ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నవంబరు 4వతేదీన దాచిన పేలుడు పదార్థాలు నింపిన టిఫిన్ బాక్స్‌ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పంజాబ్ ఘటనను తీవ్రమైన భద్రతా లోపంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం నుంచి వివరణ నివేదికను కోరింది. ఈ లోపానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.ప్రధానమంత్రి వెళ్లే మార్గం కేవలం పంజాబ్ పోలీసులకు మాత్రమే తెలుసని, ఇలాంటి పోలీసుల ప్రవర్తన ఎప్పుడూ చూడలేదని కేంద్ర హోంశాఖ అధికారి వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-01-06T13:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising