ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందువునైనందుకే తిరస్కరించారు : సునీల్ జక్కర్

ABN, First Publish Date - 2022-02-02T23:25:11+05:30

పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న కసరత్తు నుంచి తన పేరును తొలగించడానికి కారణం తాను హిందువును కావడమేనని ఆ పార్టీ నేత సునీల్ జక్కర్ ఆరోపించారు. ఓ మీడియా సంస్థతో బుధవారం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవికి సిక్కు నేత అయితే బాగుంటుందని ఢిల్లీలో కూర్చున్న సలహాదారులు తనకు చెప్పారన్నారు. పంజాబ్ లౌకికవాద రాష్ట్రమని గుర్తు చేశారు. 


ఢిల్లీలో కూర్చున్న సలహాదారులు అధిష్ఠానానికి సరైన సలహాలు ఇవ్వడం లేదన్నారు. తాను హిందువునైనందువల్ల తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించబోమని చెప్పకుండా, తాను ఎమ్మెల్యేను కానందువల్ల, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడం లేదని చెబితే బాగుండేదన్నారు. ఎంపిక చేసిన దళిత నేత సరైనవాడనుకుంటే, ఆయనకు మద్దతును పార్టీ కొనసాగించాలన్నారు. శాసన సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని అన్నారు. 


ఇదిలావుండగా, అంతకుముందు ప్రచారం జరిగినట్లుగా పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని బుధవారం ఆ పార్టీ ప్రకటించబోవడం లేదని సమాచారం. 


Updated Date - 2022-02-02T23:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising